Hyderabad Horror: హైదరాబాద్ లోని ఘట్ కేసర్ లో దారుణం.. ఆస్తి కోసం భర్తను ఇనుప గొలుసులతో కట్టేసిన భార్య
హైదరాబాద్ శివార్లలోని ఘట్ కేసర్ లో ఘోరం జరిగింది. ఆస్తి కోసం ఓ మహిళ తన భర్తను ఇనుప గొలుసుతో కట్టేసి చిత్రహింసలకు గురిచేసింది.
Hyderabad, May 4: హైదరాబాద్ (Hyderabad) శివార్లలోని ఘట్ కేసర్ లో (Ghatkesar) ఘోరం జరిగింది. ఆస్తి కోసం ఓ మహిళ తన భర్తను ఇనుప గొలుసుతో కట్టేసి చిత్రహింసలకు గురిచేసింది. భారతమ్మ అలియాస్ భారతి, పత్తి నరసింహ అలియాస్ కృష్ణ భార్యాభర్తలు. ప్లాట్ల విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సంవత్సరం క్రితం నరసింహ ఇల్లు వదిలి వెళ్లిపోయారు. ఇటీవల భర్త ఆచూకీ తెలుసుకున్న నరసింహను ఇంటికి తీసుకొచ్చి ఓ గదిలో వేసి ఇనుప గొలుసులతో కట్టేసి తాళం వేసింది. ఇంటి స్థలాన్ని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయాలని తనను చిత్రహింసలు పెడుతున్నట్టు భర్త ఆరోపించాడు. దీంతో పోలీసులు నరసింహను విడిపించి.. భార్య భారతమ్మపై కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)