Newdelhi, May 4: మహారాష్ట్రలో (Maharastra) గుండెలు (Heart) అదిరిపోయే ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు తన ఇంట్లో బాత్రూంకు (Toilet) వెళ్తుండగా కమోడ్ లోపల నుంచి పాము బుసలు కొడుతున్న శబ్దం వినిపించింది. అయితే ముందు దాన్ని పెద్దగా పట్టించుకోని అతను.. టాయ్ లెట్ కు వెళ్ళడంలో నిమగ్నమయ్యాడు. కానీ ఆగకుండా శబ్దం వస్తుండటంతో టాయ్ లెట్ సీట్ కిందకు తొంగి చూశాడు. లోపల 10 అడుగుల పెద్ద పాము. అతన్ని చూస్తూ బసలు కొడుతోంది. దీంతో ఒక్క ఉదుటున పైకి లేచి అతను బయటకు పరుగు తీశాడు. పాములు పట్టడంలో పేరున్న ఓ యువతికి వెంటనే ఫోన్ చేశాడు. ఆమె వచ్చి 10 అడుగుల పొడవున్న ఆ పామును జాగ్రత్తగా బయటకు తీసింది. అయితే, ఆ పాము విషపూరితం కాదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది.

Monkey Treating Wound in World First: మనుషులే కాదు అడవుల్లో జీవించే జంతువులు కూడా పసరు వైద్యం చేసుకుంటయ్... ఏ మొక్కలో ఏ ఔషధ గుణాలు ఉన్నాయో వాటికి బాగా తెలుసు... తనకు తగిలిన గాయాన్ని మాన్పించుకునేందుకు ఆకు పసరుతో స్వీయ చికిత్స చేసుకున్న ఓ కోతి.. ప్రపంచంలోనే తొలిసారిగా రికార్డ్ చేసిన ఇండోనేషియా పరిశోధకులు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)