E-Challan Scam Alert: ఈ-చలాన్ మోసాల పట్ల జాగ్రత్త వహించండి, తెలంగాణ పోలీస్ హెచ్చరిక, అధికారిక లింక్‌నే ఓపెన్ చేయండని సూచన!
సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఏ చిన్న అవకాశం దొరికిన సైబర్ కేటుగాళ్లు పంజా విసుతున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ నిధులు విడుదల చేసిన సందర్భంగా ఫేక్ లింక్‌ను రైతులకు పంపి ఆ డబ్బును దోచేందుకు కేటుగాళ్లు ప్రయత్నించిన సంగతి తెలిసిందే.
Hyd, July 24: సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఏ చిన్న అవకాశం దొరికిన సైబర్ కేటుగాళ్లు పంజా విసుతున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ నిధులు విడుదల చేసిన సందర్భంగా ఫేక్ లింక్‌ను రైతులకు పంపి ఆ డబ్బును దోచేందుకు కేటుగాళ్లు ప్రయత్నించిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ చలాన్ మోసాల పట్ల జాగ్రత్త వహించాలని ప్రజలకు తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. స్కామర్‌లు అధికారిక లింక్‌ను పోలి ఉండే లింక్‌లను ఉపయోగిస్తారని కాబట్టి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ వెబ్‌సైట్‌లు ఎల్లప్పుడూ '.gov.in' డొమైన్‌ను కలిగి ఉంటాయని తెలిపారు. ట్రాఫిక్ చలాన్ యొక్క అధికారిక వెబ్‌సైట్: https://echallan.parivahan.gov.in, https://echallan.tspolice.gov.inలను మాత్రమే ఉపయోగించాలని హితవు పలికారు. రెండో రోజు సభకు రాని కేసీఆర్, ఆర్టీసీపై సభలో రగడ, హరీష్ - మంత్రి శ్రీధర్ మధ్య మాటల యుద్ధం
Here's Tweet:
Beware of E-Challan Scams!
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)