CM Yogi Visits Bhagyalaxmi Temple: భాగ్యలక్ష్మి ఆలయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, ఓల్డ్ సిటీలో కట్టుదిట్టమైన భద్రత, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన యోగి
ముఖ‍్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కూడా నగరానికి చేరుకున్నారు. కాగా, సీఎం యోగి..(CM Yogi) ఆదివారం ఉదయం చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని (Bhagyalakxmi Temple) దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Hyderabad, July 03: తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల (BJP National Excutive meeting) నేపథ్యంలో కాషాయ పార్టీకి చెందిన సీఎంలు, కేంద్ర మంత్రులు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ (Uttarapradesh) ముఖ‍్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కూడా నగరానికి చేరుకున్నారు. కాగా, సీఎం యోగి..(CM Yogi) ఆదివారం ఉదయం చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని (Bhagyalakxmi Temple) దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎంతో యోగితో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్ సహా పలువురు బీజేపీ నేతలు ఉన్నారు. సీఎం యోగి ఆలయానికి వస్తున్న నేపథ్యంలో పోలీసులు చార్మినార్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతీ ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీలు చేసి పంపిస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)