Hyderabad Rename: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మార్చుతాం.. యూపీ సీఎం యోగి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకోవడంతో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అగ్రనేతలు రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
Hyderabad, Nov 26: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections) ప్రచారం ముగింపు దశకు చేరుకోవడంతో జాతీయ పార్టీలైన బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) పార్టీల అగ్రనేతలు రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌కు మద్దతుగా యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ శనివారం ప్రచారం నిర్వహించారు. బేగంబజార్ చౌరస్తాలో ఆయన మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ నగరం పేరుని ‘భాగ్యనగరం’గా మార్చుతామని హామీ ఇచ్చారు. గోషామహల్ లో హిందూ ధర్మం కోసం పోరాడే వ్యక్తి రాజాసింగ్‌ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)