Hyderabad, Nov 26: తెలంగాణ (Telangana) సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ (Congress) పట్టుదలగా ప్రయత్నిస్తోంది. రాహుల్ గాంధీ (Rahul Gandhi) సహా పార్టీ అగ్రనేతలు ఇప్పటికే పలుమార్లు రాష్ట్రంలో ప్రచారం నిర్వహించారు. పోలింగ్ (Polling) కు నాలుగు రోజులే ఉన్న నేపథ్యంలో రాహుల్ గాంధీ వినూత్న మార్గాల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. శనివారం రాత్రి రాహుల్ నగరంలోని ముషీరాబాద్, అశోక్ నగర్ ప్రాంతాల్లో అకస్మాత్తుగా పర్యటించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులతో చిట్ చాట్ నిర్వహించారు. వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పేపర్ లీక్ ఉదంతం, నోటిఫికేషన్ల నిలిపివేత వంటి అంశాలు చర్చకు వచ్చాయి. కాగా, ఉద్యోగార్థులపై సీఎం కేసీఆర్ తీరును రాహుల్ ఖండించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలు తీరుస్తానని భరోసా ఇచ్చారు.
Shri. Rahul Gandhi meets and listens to the concerns and students & job aspirants in Ashok nagar, Hyderabad. pic.twitter.com/ix36ZSCu65
— Telangana Congress (@INCTelangana) November 25, 2023
బావర్చీలో బిర్యానీ
చిట్ చాట్ అనంతరం కొందరు పోటీ పరీక్షల అభ్యర్థులతో కలిసి చిక్కడపల్లిలోని బావర్చీ హోటల్ లో రాహుల్ బిర్యానీ తిన్నారు. అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగారు.