Credits: Twitter

Hyderabad, Nov 26: అసెంబ్లీ ఎన్నికలను (Assembly Elections) దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌ (Hyderabad), సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఈ నెల 28న సాయంత్రం 5గంటల నుంచి 30 సాయంత్రం 5గంటల వరకు మద్యం షాపులు (Wine Shops), బార్‌ అండ్‌ రెస్టారెంట్లను మూసివేయాలని మూడు కమిషనరేట్ల పోలీసు కమిషనర్లు ఆదేశాలు జారీ చేశారు. స్టార్‌ హోటల్స్‌, పబ్బులు, క్లబ్బుల్లో కూడా మద్యం సరఫరాను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో కూడా దాదాపుగా ఇవే నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

IND Vs AUS T20: నేడు భారత్‌, ఆస్ట్రేలియా రెండో టీ20.. సాయంత్రం 7.00 నుంచి మ్యాచ్.. ఆటకు వరణుడి ముప్పు??

ఓట్ల లెక్కింపు రోజు ఇలా..

ఓట్ల లెక్కింపు నేపథ్యంలో డిసెంబర్‌ 3న ఉదయం 6 గంటల నుంచి లెక్కింపు పూర్తయ్యే వరకు ట్రై కమిషనరేట్ల పరిధిలోని మద్యం దుకాణాలు, బార్లను మూసివేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

EC Notices To KTR: మ‌రో వివాదంలో మంత్రి కేటీఆర్, ప్ర‌చారం కోసం ఆ ప్లేస్ ఎలా వాడుకుంటారంటూ ఈసీ సీరియ‌స్, ఆదివారం మ‌ద్యాహ్నం 3 గంట‌ల్లోగా వివ‌రణ ఇవ్వాలంటూ ఆదేశం