LB Nagar Road Accident Video: ఎల్బీనగర్ చిన్నారి మృతి వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద నిర్లక్ష్యంగా కారు డోర్ ఓపెన్ చేసిన డ్రైవర్
హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కారు డ్రైవర్ల నిర్లక్ష్యానికి రెండు సంవత్సరాల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కారు డ్రైవర్ల నిర్లక్ష్యానికి రెండు సంవత్సరాల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం మన్సురాబాద్ నుంచి ఎల్బీ నగర్ రూట్‌లోకారు డ్రైవర్ నడిరోడ్డులో కారు ఆపాడు.
ఓ వ్యక్తి దిగి వెళ్లిపోగా.. డ్రైవర్ సీట్‌లో ఉన్న వ్యక్తి హఠాత్తుగా కారు డోర్ తీశాడు. ఆ సమయంలో పక్క నుంచి వెళ్తున్న బైకు కారుడోర్‌కు తగిలింది. దీంతో ఆ బైక్‌పై ఉన్న కుటుంబ సభ్యులు కిందపడిపోయారు. దీంతో రోడ్డుపై ఉన్న రాయి బలంగా తగలడంతో చిన్నారి ధనలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా.. తల్లి శశిరేఖ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆ కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.
Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)