Leopard Killed on NH-44: రాత్రి పూట రోడ్డు దాటుతుండగా రెండేళ్ల చిరుతిపులిని ఢీకొట్టిన వాహనం, విలవిలలాడుతూ అక్కడికక్కడే మృతి, వీడియో ఇదిగో..

నార్సింగి మండలం వల్లూరు వద్ద ఎన్‌హెచ్‌-44పై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిరుతపులి మృతి చెందింది. జంతువు రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో చిరుత అక్కడికక్కడే మృతి చెందింది.సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పశువైద్యశాలకు తరలించారు

Leopard killed on NH-44 in Medak (photo-X/Suryareddy)

నార్సింగి మండలం వల్లూరు వద్ద ఎన్‌హెచ్‌-44పై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిరుతపులి మృతి చెందింది. జంతువు రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో చిరుత అక్కడికక్కడే మృతి చెందింది.సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పశువైద్యశాలకు తరలించారు. పోలీసులు వాహనం ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.

తెలంగాణ చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ ఎలుసింగ్ మేరు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి సమయంలో చిరుతపులి రోడ్డు దాటేందుకు ప్రయత్నించడంతో ప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు, రెండేళ్ల మగ జంతువు సమీప అటవీ ప్రాంతం నుంచి వచ్చిందని నిర్ధారించారు. వన్యప్రాణులు హైవేను దాటకుండా నిరోధించేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌కు మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని మేరు తెలిపారు. దీనిపై ఇప్పటికే అటవీశాఖ ఎన్‌హెచ్‌ఏఐకి లేఖ రాసిందని చెప్పారు. గాయపడిన చిరుతపులిని చిత్రీకరించిన బాటసారుల వీడియోలు సోషల్ మీడియలో కనిపించాయి.

Leopard killed on NH-44 in Medak

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement