Traffic Police Saves Woman Life: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి యువతి ఆత్మాహత్యాయత్నం, క్షణాల్లో స్పందించి ఆమెను కాపాడిన మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు
మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు సకాలంలో స్పందించి ఆమెను అడ్డుకుని ప్రాణాలు కాపాడారు. దాదాపు 25 ఏళ్ల వయసు ఉన్న యువతి సోమవారం మధ్యాహ్నం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీదకు వెళ్లింది.
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వద్ద ఓ యువతి ఆత్మహత్యయత్నం చేయడం కలకలం రేపింది. మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు సకాలంలో స్పందించి ఆమెను అడ్డుకుని ప్రాణాలు కాపాడారు. దాదాపు 25 ఏళ్ల వయసు ఉన్న యువతి సోమవారం మధ్యాహ్నం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీదకు వెళ్లింది. ఒక్కసారిగా కేబుల్ బ్రిడ్జి మీద నుంచి దుర్గం చెరువు లేక్ లోకి దూకేందుకు ప్రయత్నించింది. దారుణం, మహిళను కొమ్ములతో ఈడ్చుకెళ్లిన గేదె, అడ్డుకున్న ఇద్దరు యువకులపై కూడా దాడి, గాయానికి 25 కుట్లు వేసిన వైద్యులు,వీడియో ఇదిగో..
కేబుల్ బ్రిడ్జి వద్ద ఉండి ఇది గమనించిన మాదాపూర్ ట్రాఫిక్ సిబ్బంది అక్కడికి చేరుకుని యువతిని నీళ్లల్లోకి దూకకుండా అడ్డుకుని ఆమె ప్రాణాలు కాపాడారు. పోలీస్ వాహనంలో ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశారో అందుకు కారణాలు తెలియాల్సి ఉంది. కాగా ఆ యువతి మాత్రలు మింగినట్లుగా తెలుస్తోంది. అనంతరం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.
Here's Pics
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)