Fire Accident At Kushaiguda: కుషాయిగూడ బస్‌డిపోలో అగ్ని ప్రమాదం.. రెండు బస్సులలో చెలరేగిన మంటలు, నిమిషాల్లోనే దగ్దం, వీడియో
హైదరాబాద్ బస్ డిపోలో భారీ ప్రమాదం జరిగింది. రెండు బస్సులలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి . హైదరాబాద్ - కుషాయిగూడ డిపోలో పార్కింగ్ లో ఉన్న రెండు బస్సుల్లో ఒక్కసారిగా చెలరేగాయి మంటలు.
హైదరాబాద్ బస్ డిపోలో భారీ ప్రమాదం జరిగింది. రెండు బస్సులలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి(Fire Accident At Kushaiguda). హైదరాబాద్ - కుషాయిగూడ డిపోలో(Kushaiguda Bus Depo) పార్కింగ్ లో ఉన్న రెండు బస్సుల్లో ఒక్కసారిగా చెలరేగాయి మంటలు.
కొన్ని నిమిషాలలో బస్సులు దగ్దం అయ్యాయి. భయంతో డిపోలో నుండి పరిగెత్తారు ఉద్యోగులు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక మరో ఘటనలో సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భూదేవినగర్ సమీపంలోని పోచమ్మ తల్లి దేవాలయం వద్ద రాత్రి సమయంలో ఇద్దరు మహిళలు.. అప్పుడే పుట్టిన మగశిశువును రోడ్డు పక్కన వదిలి వెళ్లారు. నవజాత శిశువును గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు శిశువును నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవిగో..
Massive Fire at Kushaiguda Bus Depo