Attack on Female Doctor in Gandhi Hospital: వీడియో ఇదిగో, గాంధీ ఆసుపత్రిలో జూనియర్‌ వైద్యురాలిపై దాడి, ఆందోళనకు సిద్ధమవుతున్న జూనియర్ డాక్టర్లు

ఎమర్జెన్సీ వార్డులో మహిళా జూనియర్ డాక్టర్‌పై రోగి సహాయకుడు దాడికి పాల్పడ్డాడు. రోగి బంధువు లాగి, దాడి చేయడంతో అతడి బారి నుంచి ఇతర సిబ్బంది డాక్టర్‌ను కాపాడారు.

Attack on Female Doctor in Gandhi Hospital (photo-Video Grab)

సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో జూనియర్‌ వైద్యురాలిపై రోగి బంధువు దాడి చేశాడు. ఎమర్జెన్సీ వార్డులో మహిళా జూనియర్ డాక్టర్‌పై రోగి సహాయకుడు దాడికి పాల్పడ్డాడు. రోగి బంధువు లాగి, దాడి చేయడంతో అతడి బారి నుంచి ఇతర సిబ్బంది డాక్టర్‌ను కాపాడారు. డాక్టర్‌పై దాడికి పాల్పడిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. పోలీసులు వెంటనే నిందితుడ్ని అదుపులోకి తీసుకుని చిలకలగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జూనియర్ డాక్టర్లు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. రోగి సహాయకుడు దాడికి పాల్పడటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. . గుజరాత్‌లోని ఓ గోదాంలో ప్రమాదం, బస్తాలు జారి పడి కార్మికుడు మృతి, సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)