BRS MLA Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావు ఇంట్లో పోలీసులు.. వీడియో ఇదిగో
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మధ్య నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారడం, మహిళలను కించపరిచే విధంగా కౌశిక్ రెడ్డి మాట్లాడారంటూ కాంగ్రెస్ ఆందోళనలు, కౌశిక్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిందంటూ బీఆర్ఎస్ నేతల నిరసనలు వెరసి తెలంగాణ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.
Hyderabad, Sep 13: బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) కౌశిక్ రెడ్డి (Kaushik Reddy), కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మధ్య నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారడం, మహిళలను కించపరిచే విధంగా కౌశిక్ రెడ్డి మాట్లాడారంటూ కాంగ్రెస్ ఆందోళనలు, కౌశిక్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిందంటూ బీఆర్ఎస్ నేతల నిరసనలు వెరసి తెలంగాణ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. కౌశిక్ రెడ్డిపై అరికెపూడి గాంధీ, ఆయన అనుచరులు దాడి చేశారంటూ బీఆర్ఎస్ నేతలు నిన్న హైదరాబాదులో పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద బైఠాయించిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితర బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి తలకొండపల్లి పీఎస్ కు వాహనాల్లో తరలించారు. ఈ క్రమంలో ఈ ఉదయం హరీష్ రావు ఇంట్లో పోలీసులు పెద్దయెత్తున గుమిగూడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Here's Video: