Rain in Hyderabad Videos: హైదరాబాద్‌లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం, పలు ప్రాంతాలు జలమయం, భారీగా ట్రాఫిక్ జాం, వీడియోలో ఇవిగో
హైదరాబాద్‌లో ఈ రోజు మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘావృత్తమై భారీ వాన కురుస్తోంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతున్నారు. నగరంలోని జూబ్లీహిల్, బంజారాహిల్స్, ఫిల్మీంనగర్‌లో భారీ వర్షం పడుతోంది. వర్షం పడుతుండటంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య నెలకొంది
హైదరాబాద్‌లో ఈ రోజు మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘావృత్తమై భారీ వాన కురుస్తోంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతున్నారు. నగరంలోని జూబ్లీహిల్, బంజారాహిల్స్, ఫిల్మీంనగర్‌లో భారీ వర్షం పడుతోంది. వర్షం పడుతుండటంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య నెలకొంది. మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించిన వాతావరణ శాఖ
బలమైన గాలుల ధాటికి కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, షేక్‌పేట, ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్డీకపూల్, అమీర్‌పేట, రాజేంద్రనగర్, అత్తాపూర్, కిస్మత్‌పురా, ఎస్సార్‌నగర్, ఎర్రగడ్డ, యూసఫ్‌గూడ, లంగర్‌హౌస్, గండిపేట్, శివరాంపల్లి ప్రాంతాల్లో జోరుగా వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జీహెచ్‌ఎంసీ విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)