CM Revanth Reddy: ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తొలి రెండు సంతకాలు ఇవిగో, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై తొలి సంతకం, దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగ నియామక పత్రంపై రెండో సంతకం

ఎల్బీ స్టేడియంలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన ఆరు గ్యారెంటీలపై సంతకం చేశారు. రెండో సంతకం దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగ నియామక పత్రంపై చేశారు

Revanth Reddy sworn in as Telangana CM

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి సచివాలయానికి బయలుదేరారు. ఎల్బీ స్టేడియంలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన ఆరు గ్యారెంటీలపై సంతకం చేశారు. రెండో సంతకం దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగ నియామక పత్రంపై చేశారు. అనంతరం సచివాలయానికి బయలుదేరారు.

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇవే:

మహాలక్ష్మి పథకం - పేద మహిళలకు నెలకు రూ. 2,500. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ. 500కే గ్యాస్ సిలిండర్.

గృహజ్యోతి - ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.

రైతు భరోసా - రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ. 15,000. వ్యవసాయ కూలీలకు రూ. 12,000. వరి పంటకు రూ 500 బోనస్.

యువ వికాసం - ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్. విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు.

చేయూత - రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా రూ. 10 లక్షలు. నెలవారీ పింఛను రూ. 4,000.

ఇందిరమ్మ ఇళ్లు - ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం. ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, రూ. 5 లక్షలు.

Here's Taking Oath Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)