Road Accident Video: అతివేగంగా దూసుకొచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన టిప్పర్‌, మహిళ పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి, సీసీ పుటేజీ ఇదిగో..

మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అతివేగంగా దూసుకొచ్చిన టిప్పర్‌ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.

Road Accident Caught on Cam (Photo-Video Grab)

మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అతివేగంగా దూసుకొచ్చిన టిప్పర్‌ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మీర్‌పేట ఇన్‌స్పెక్టర్‌ కాశీ విశ్వనాథం కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా బూత్‌పూర్‌ మండలం మదిగట్ల గ్రామానికి చెందిన లక్ష్మమ్మ(52) తన కొడుకు, కోడలుతో కలిసి హస్తినాపురం సమీపంలోని అగ్రికల్చర్‌ కాలనీ వైపు వెళ్లారు.

అక్కడ తెలిసిన వారి దగ్గర డబ్బులు తీసుకొని.. తిరిగి చంపాపేటకు బయలుదేరారు. కొడుకు, కోడలు వేరే వాహనంపై వెళ్లారు. మరో ద్విచక్ర వాహనంపై ట్రిపుల్‌ రైడింగ్‌లో తెలిసిన వారితో కలిసి లక్ష్మమ్మ వెళ్తోంది. ఇదే సమయంలో వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన టిప్పర్‌ లక్ష్మమ్మ వెళ్తున్న వాహనాన్ని ఢీ కొట్టింది. వెనుక కూర్చున్న ఆమె కిందపడిపోయింది. టిప్పర్‌ ఆమె పైనుంచి వెళ్లడంతో మృతి చెందింది. మిగతా ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి.

Here's Video