Road Accident Caught on Camera: వీడియో ఇదిగో, అత్యంత వేగంతో వచ్చి రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టిన బైక్, ఎగిరి డివైడర్‌పై పడి మృతి చెందిన బైక్ వెనకాల కూర్చున్న వ్యక్తి

గజ్వేల్‌ పట్టణంలో అతివేగం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ప్రజ్ఞాపూర్‌కు చెందిన గట్టు శ్రావణ్‌కుమార్‌ యాదవ్‌(18) గుంటూరు జిల్లాకు చెందిన స్నేహితుడు పూసులూరి త్రినాథ్‌(18)తో కలిసి ద్విచక్ర వాహనంపై పిడిచెడ్‌ రోడ్డులో శివాజీ విగ్రహం నుంచి గజ్వేల్‌ వివేకానంద చౌరస్తా వైపునకు వస్తున్నారు.

Speeding Bike Hit a Man while crossing the road in Gajwel

గజ్వేల్‌ పట్టణంలో అతివేగం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ప్రజ్ఞాపూర్‌కు చెందిన గట్టు శ్రావణ్‌కుమార్‌ యాదవ్‌(18) గుంటూరు జిల్లాకు చెందిన స్నేహితుడు పూసులూరి త్రినాథ్‌(18)తో కలిసి ద్విచక్ర వాహనంపై పిడిచెడ్‌ రోడ్డులో శివాజీ విగ్రహం నుంచి గజ్వేల్‌ వివేకానంద చౌరస్తా వైపునకు వస్తున్నారు. త్రినాథ్‌ ద్విచక్ర వాహనాన్ని నడుపుతుండగా.. శ్రావణ్‌కుమార్‌ వెనక కూర్చున్నాడు. షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, భారీ వాహనం కిందపడి తృటిలో చావు నుండి తప్పించుకున్న బైక్ రైడర్, వీడియో ఇదిగో..

ఆ సమయంలోనే రోడ్డు దాటుతున్న పాదచారి తొగుటకు చెందిన కనకయ్యను బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కనకయ్యకు, త్రినాథ్‌కు స్వల్పగాయాలయ్యాయి. బైక్ వెనక కూర్చున్న శ్రావణ్‌కుమార్‌ ఎగిరి డివైడర్‌పై పడడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు గమనించి గజ్వేల్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. శ్రావణ్‌కుమార్‌ తండ్రి గట్టు రమేశ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు గజ్వేల్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.సైదా తెలిపారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now