Road Accident At Pullur Toll Plaza:పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర రోడ్డు ప్రమాదం..లారీని ఢీకొట్టిన రెండు ప్రైవేట్ బస్సులు, 40 మందికి గాయాలు.. వీడియో ఇదిగో

జోగులాంబ గద్వాల జిల్లా ఉండల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా(Road Accident At Pullur Toll Plaza) దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది.

Road Accident Near Pullur Toll Plaza, Two Private Buses Collide with a Truck(X)

జోగులాంబ గద్వాల జిల్లా ఉండల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా(Road Accident At Pullur Toll Plaza) దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఢీ కొట్టాయి రెండు ప్రైవేట్ బస్సులు(Two Private Buses Collide). యూటర్న్ తీసుకుంటున్న లారీని ఢీ కొట్టింది హైదరాబాద్ నుంచి కడప వెళ్తున్న బస్సు. ఆ వెనకే ఆ బస్సును హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న బస్సు ఢీ కొట్టింది.

తిరుపతి వెళుతున్న బస్సులో డ్రైవర్ కాళ్లు విరగగా సుమారు 40 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. బాధితులను కర్నూల్ ఆసుపత్రికి తరలించగా కడప వెళ్తున్న బస్సులో ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. తిరుపతి వెళుతున్న బస్సు ప్రయాణికులకు కొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ఇక రంగారెడ్డి జిల్లా నార్సింగిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ డాక్టర్ ప్రాణాలు కొల్పోయాడు. ఖానాపూర్ వద్ద డివైడర్ ను ఢీ కొట్టింది కారు. కారులో ప్రయాణిస్తున్న డాక్టర్ జస్వంత్ స్పాట్ డెత్ అయ్యారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.  రంగారెడ్డి జిల్లా నార్సింగిలో రోడ్డు ప్రమాదం.. డాక్టర్ ప్రాణం తీసిన అతివేగం, డివైడర్‌ను ఢీకొట్టిన కారు..స్పాట్‌లోనే డాక్టర్ మృతి ,వీడియో

Road Accident Near Pullur Toll Plaza, Two Private Buses Collide with a Truck

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement