My Home Cement Factory Accident: మై హోం సిమెంట్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం, అయిదుగురు కార్మికులు మృతి
సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని మైహోం సిమెంట్ ఫ్యాక్టరీలో మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతిచెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. బాధితులు ఉత్తర్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందినవారుగా తెలుస్తోంది
సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని మైహోం సిమెంట్ ఫ్యాక్టరీలో మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతిచెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. బాధితులు ఉత్తర్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందినవారుగా తెలుస్తోంది. అనుమతి లేకుండా నూతనంగా నిర్మిస్తున్న యూనిట్-4 ప్లాంట్ వద్ద ప్రమాదఘటన జరిగింది. 500 అడుగుల ఎత్తులో కాంక్రీట్ వర్క్ చేస్తుండగా లిఫ్ట్ కూలి కాంట్రాక్ట్ కార్మికులు కిందపడిపోయారు. మై హోమ్ యాజమాన్యం ఈ ప్రమాదంపై గోప్యత పాటిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)