Hyderabad Ganesh Idol Immersion: గణేశ్ నిమజ్జనంలో పోకిరీల ఆగడాలు.. కేసులు నమోదు చేసి 250 మందిని అరెస్ట్ చేసిన షీ టీమ్స్
హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగిన గణేశ్ నిమజ్జనం సందట్లో మహిళలు, యువతులపై వేధింపులకు దిగిన పోకిరీలను నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Hyderabad, Sep 29: హైదరాబాద్ లో (Hyderabad) అంగరంగ వైభవంగా జరిగిన గణేశ్ నిమజ్జనం (Ganesh Idol Immersion) సందట్లో మహిళలు, యువతులపై వేధింపులకు దిగిన పోకిరీలను నగర పోలీసులు (Police) అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 250 మందిపై షీటీమ్స్ కేసులు పెట్టినట్టు హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ తాజాగా వెల్లడించారు. గణేశ్ నిమజ్జనం ముగిసిందని శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో సీవీ ఆనంద్ తెలిపారు. ఉత్సవాలకు వచ్చిన మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం, వేధించడం చేసిన 250 మంది పోకిరీలను అరెస్ట్ చేశామని తెలిపారు. శోభయాత్రకు కొందరు మద్యం మత్తులో వచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Rains in Telangana: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ ప్రకటన
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)