Charminar Express Derailment: చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన రైల్వేశాఖ, పూర్తిగా కోలుకునేవరకు చికిత్స అందిస్తామని వెల్లడి
ఈ ప్రమాదంలో గాయాలపాలైన ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. తీవ్ర గాయాలపాలైన వారికి రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.50 వేలు అందజేస్తామని ఓ ప్రకటన విడుదల చేసింది.
నాంపల్లి రైల్వే స్టేషన్ లో బుధవారం ఉదయం చార్మినార్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయాలపాలైన ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. తీవ్ర గాయాలపాలైన వారికి రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.50 వేలు అందజేస్తామని ఓ ప్రకటన విడుదల చేసింది. వారు పూర్తిగా కోలుకునేంత వరకు హాస్పిటల్‌లోనే చికిత్స అందిస్తామని దక్షిణ మధ్య రైల్వే CPRO రాకేశ్ తెలిపారు.స్టేషన్ లో రైలు పట్టాలు తప్పడంతో మూడు బోగీలు పక్కకు ఒరిగాయని, ఒక్కసారిగా రైలు కుదుపులకు లోనవడంతో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారని అధికారులు తెలిపారు.
హైదరాబాద్‌లో పలు ఎంఎంటీఎస్(MMTS Trains) రైళ్లు రద్దు( Canceled) చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. నాంపల్లి-మేడ్చల్ మార్గంలో సర్వీసులను అధికారులు రద్దు చేశారు. చార్మినార్ ఎక్స్‌ప్రెస్(,Charminar Express) పట్టాలు తప్పిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో కీలక విషయాలను వెల్లడించిన రైల్వే శాఖ, రైలు డెడ్ ఎండ్‌కు వచ్చిన తర్వాతే సైడ్ వాల్‌ను ఢీకొట్టిందని వెల్లడి, చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై మంత్రి పొన్నం విచారం
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)