SC on MAA Telangana Party: ఇష్టానుసారంగా పిటిషన్‌లు వేస్తే పేద పార్టీ అంటారా, మా తెలంగాణ పార్టీపై సుప్రీంకోర్టు ఆగ్రహం, పెనాల్టీ కట్టాల్సిందేనని ఆదేశాలు

మా తెలంగాణ పార్టీకి సుప్రీంకోర్టులో చుక్కెదురయింది. అనవసర పిటిషన్లతో కోర్టు సమయం వృథా చేయడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా తెలంగాణ హైకోర్టులో తప్పుడు పిటిషన్‌ వేసినందుకు మా తెలంగాణ పార్టీకి రూ.50 వేల జరిమానా విధించింది

Supreme Court. (Photo Credits: PTI)

మా తెలంగాణ పార్టీకి సుప్రీంకోర్టులో చుక్కెదురయింది. అనవసర పిటిషన్లతో కోర్టు సమయం వృథా చేయడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా తెలంగాణ హైకోర్టులో తప్పుడు పిటిషన్‌ వేసినందుకు మా తెలంగాణ పార్టీకి రూ.50 వేల జరిమానా విధించింది. హైకోర్టు తీర్పుపై సదరు పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు జరిమానాను మాఫీ చేయాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ వేసింది.

తమ క్లైంట్‌ది పేద పార్టీ అని, హైకోర్టు విధించిన జరిమానా కట్టలేమని మా తెలంగాణ పార్టీ తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు మా తెలంగాణ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇష్టానుసారంగా పిటిషన్‌లు వేస్తే పేద పార్టీ అంటారా? అని సీజేఐ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. పేద పార్టీ అంటూ అడ్వొకేట్‌ను తప్పుపట్టించింనందుకు పెనాల్టీ కట్టాలని మా తెలంగాణ పార్టీని ఆదేశించింది.

Bar Bench Tweets

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement