Tatikonda Rajaiah: రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తాటికొండ రాజయ్య, కార్పోరేషన్ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగనున్న స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సోమవారం రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ 115 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో స్టేషన్ ఘనపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యకు అవకాశం దక్కలేదు.

Tatikonda Rajaiah (Photo-X)

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సోమవారం రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ 115 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో స్టేషన్ ఘనపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యకు అవకాశం దక్కలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పార్టీ నేతలు ఆయనతో సంప్రదింపులు జరిపి, బుజ్జగించారు. ఈ క్రమంలో రైతుబంధు సమితి అధ్యక్షుడిగా నియమించారు. రాజయ్య ఈ రోజు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఈ కార్పోరేషన్ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు.

Tatikonda Rajaiah (Photo-X)
Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement