Telangana: సిక్కీంలో జరిగిన పారాగ్లైడింగ్‌లో తెలంగాణ యువతి మృతి, ఆమె గైడ్ సందీప్ గురుంగ్ కూడా మృతి, వేగంగా వచ్చిన గాలులతో ఒకదానికొకటి ఢీకొన్న పారాచూట్​లు

బాధితురాల్ని ఖమ్మంకు చెందిన రామ్​కుమార్​ రెడ్డి కుమార్తె ఈశా రెడ్డి సంకెపల్లి(23)గా అధికారులు గుర్తించారు. సిక్కిం పర్యాటకానికి వెళ్లిన ఈశా.. శుక్రవారం ఉదయం లాఛుంగ్​ వ్యూ పాయింట్​ నుంచి పారాగ్లైండింగ్​లో పాల్గొంది.

Representative Image

నార్త్ సిక్కింలో జరిగిన పారాగ్లైడింగ్ ప్రమాదంలో హైదరాబాద్​కు చెందిన యువతి ప్రాణాలు కోల్పోయింది. బాధితురాల్ని ఖమ్మంకు చెందిన రామ్​కుమార్​ రెడ్డి కుమార్తె ఈశా రెడ్డి సంకెపల్లి(23)గా అధికారులు గుర్తించారు. సిక్కిం పర్యాటకానికి వెళ్లిన ఈశా.. శుక్రవారం ఉదయం లాఛుంగ్​ వ్యూ పాయింట్​ నుంచి పారాగ్లైండింగ్​లో పాల్గొంది. ఈ క్రమంలో వేగంగా వచ్చిన గాలులతో పారాచూట్​లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో బాధితురాలు కింద ఉన్న నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో సిక్కింకు చెందిన పారాగ్లైడర్ సందీప్ గురుంగ్ (28) కూడా మరణించాడు. ఘటన జరిగిన వెంటనే సహాయక బృందాలు చర్యలు చేపట్టాయి. నది వేగంగా ప్రవహిస్తున్న కారణంగా రెస్క్యూ ఆపరేషన్​ కూడా కష్టతరమైంది. మృతదేహాలు నది అడుగు భాగంలో బండల కింద చిక్కుకుపోయాయి. ఇండో-టిబెటన్ సరిహద్దు దళాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఎనిమిది గంటలు తీవ్రంగా శ్రమించి మృతదేహాలను వెలికితీశాయి.