Telangana ACB Raids RTA Offices: వీడియో ఇదిగో, తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు, భారీ స్థాయిలో నగదు స్వాధీనం, ఏజెంట్లు అరెస్ట్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఖైరతాబాద్‌, మలక్‌పేట్‌, నాగోల్‌, అత్తాపూర్,మహబూబ్‌నగర్‌, సిద్ధిపేట ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు వాహనదారుల నుంచి నేరుగా ఫిర్యాదులు తీసుకుంటున్నారు

Telangana ACB, disguised as lorry drivers, raids RTA offices to uncover corruption. Cash seized, officials questioned in crackdown on bribery watch Video

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఖైరతాబాద్‌, మలక్‌పేట్‌, నాగోల్‌, అత్తాపూర్,మహబూబ్‌నగర్‌, సిద్ధిపేట ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు వాహనదారుల నుంచి నేరుగా ఫిర్యాదులు తీసుకుంటున్నారు. ఆర్డీఏ కార్యాలయాల్లో రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు.మహబూబ్‌నగర్‌లోని ఆర్టీఏ ఆఫీసులో తనిఖీలు నిర్వహించిన అధికారులు ఐదుగురు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు.  ప్రజా భవన్‌కు బాంబు బెదిరింపు కాల్, ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించే పనిలో నిమగ్నం అయిన పోలీసులు

మహబూబాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయంలో ఆరుగురు ఏజెంట్లు, రవాణా శాఖ అధికారి గౌస్ పాషా, డ్రైవర్ సుబ్బారావును అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఏజెంట్ల వద్ద 45,100 నగదు, డ్రైవర్ వద్ద 16,500 నగదు, నూతన లైసెన్స్‌లు, రెనివల్స్, ఫిట్‌నెస్‌కు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కౌంటర్లలో పనిచేసే ఉద్యోగుల వద్ద డిక్లరేషన్ కన్నా ఎక్కువ నగదు లభ్యమైంది. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలోని ఆర్టీఏ కార్యాలయంలో సిబ్బంది వద్ద అక్రమంగా ఉన్న రూ.35వేలు స్వాధీనం చేసుకున్నారు. చెక్‌పోస్టులో అనధికారికంగా విధుల్లో ఉన్న ఏడుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. కౌంటర్లలోని ఉద్యోగుల వద్ద కూడా లెక్కలు చూపని నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now