ACB Raid in Hyd: ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్‌ జ్యోతి లంచం కేసు, రూ.65 లక్షల నగదు, మూడున్నర కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు, అనంతరం అరెస్ట్

ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించగా రూ.65 లక్షల నగదు, మూడున్నర కిలోల బంగారం లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. కార్యాలయంలోనూ కొన్ని కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. తర్వాత ఆమెను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు.

ACB Seizes Rs 65.5 Lakh Cash, 3.6 kg Gold in Raid on Tribal Welfare Officer’s House After She Was Caught Red-Handed Accepting Bribe

గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్‌ విభాగం ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌(ఎస్‌ఈ) కె.జగజ్యోతి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిన సంగతి విదితమే. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో నిజామాబాద్‌ పట్టణంలో ఒక నిర్మాణ పనిని, గాజుల రామారంలో జువెనైల్‌ బాయిస్‌ హాస్టల్‌ నిర్మాణపనులను బొడుకం గంగన్న అనే లైసెన్స్‌డ్‌ కాంట్రాక్టర్‌ చేపట్టారు.

వాటికి సంబంధించిన బిల్లుల చెల్లింపుల విషయమై కాంట్రాక్టర్‌ను ఆ శాఖ ఇంజనీరింగ్‌ విభాగం ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌ కె.జగజ్యోతి లంచం డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కాంట్రాక్టర్‌ నుంచి రూ.84 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు. అనంతరం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించగా రూ.65 లక్షల నగదు, మూడున్నర కిలోల బంగారం లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. కార్యాలయంలోనూ కొన్ని కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. తర్వాత ఆమెను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు.  ప్రభుత్వం ఇచ్చే జీతాలు చాలక లంచాలకు అలవాటు, రూ. 84 వేలు తీసుకుంటూ అడ్డంగా ఏసీబీ అధికారులకు దొరికిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now