Hyd, Feb 20: మాసబ్‌ట్యాంక్‌లోని ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కే జగ జ్యోతి ఏసీబీ ధికారులకు పట్టుబడ్డారు. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 84 వేలు లంచం తీసుకుంటుండగా ఆమెను అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె కార్యాలయంతో పాటు ఇంట్లో సోదాలు నిర్వహించారు. జగ జ్యోతిని కోర్టులో హాజరు పరుస్తామని అధికారులు పేర్కొన్నారు.
ఇటీవలే నల్గొండ ప్రభుత్వాస్పత్రిలో కూడా ఓ అధికారి ఏసీబీకి దొరికిపోయిన సంగతి విదితమే. కాంట్రాక్టర్ నుంచి రూ. 3 లక్షలను తీసుకుంటుండగా పట్టుకున్నారు.నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా బాధ్యతలు నిర్వరిస్తున్న డాక్టర్ లచ్చు నాయక్ ఔషధాల సరఫరా టెండర్ కోసం వెంకన్న అనే వ్యాపారి నుంచి రూ. 3 లక్షలను డిమాండ్ చేశాడు. టెండర్ కావాలంటే ప్రతిదానిలో 10 శాతం కమిషన్ కావాలని సూపరింటెండెంట్ డిమాండ్ చేయగా ఆ మేరకే మందులు సరఫరా చేస్తున్నట్లు వెంకన్న చెప్పాడు.
Here's Video
లంచం తీసుకుంటూ దొరికి ఏడ్చిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగత్ జ్యోతి. https://t.co/gKAOAKV365 pic.twitter.com/9AAkPZR9dK
— Telugu Scribe (@TeluguScribe) February 19, 2024
గత నవంబర్ నుంచి మరింత కమిషన్ కావాలని డిమాండ్ చేయడంతో డబ్బును ఇవ్వలేని వెంకన్న… అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు.వెంకన్న రూ. 3 లక్షలను లచ్చు నాయక్ కు ఇస్తుండగా… ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డబ్బును స్వాధీనం చేసుకోవటంతో పాటు సదరు అధికారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.