Telangana Election Results 2023: ఆర్మూరు నుంచి బీజేపీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి ఘన విజయం, మూడవస్థానానికి పడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి పైడి రాకేశ్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఆర్మూర్ నుంచి బీఆర్ఎస్ నుంచి ఆశన్నగారి జీవన్ రెడ్డి, బీజేపీ నుంచి రాకేశ్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డిలు బరిలో నిలిచారు.
Assembly Election 2023 Results Live News Updates: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి పైడి రాకేశ్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఆర్మూర్ నుంచి బీఆర్ఎస్ నుంచి ఆశన్నగారి జీవన్ రెడ్డి, బీజేపీ నుంచి రాకేశ్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డిలు బరిలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి పైడి రాకేశ్ రెడ్డి సమీప కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ కుమార్‌పై గెలుపొందారు. బీజేపీ అభ్యర్థికి 40 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు.
ఇక రాష్ట్రవ్యాప్త ఫలితాలు చూస్తే... మధ్యాహ్నం గం.2.30 వరకు కాంగ్రెస్ 22 స్థానాల్లో గెలిచి, 41 సీట్లలో ముందంజలో ఉంది. బీఆర్ఎస్ 9 సీట్లలో గెలుపొంది 31 స్థానాల్లో ముందంజలో నిలిచింది. బీజేపీ 5 సీట్లు గెలిచి 3 సీట్లలో ముందంజలో ఉంది.
కామారెడ్డిలో సీఎం కేసీఆర్ మూడో స్థానానికి కేసీఆర్ పడిపోయారు.కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఉండగా, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇక్కడ మూడో స్థానానికి పడిపోయారు.