Telangana Election Results 2023: గోషామహల్‌లో రాజాసింగ్ ఘన విజయం, వరుసగా హ్యట్రిక్ కొట్టిన బీజేపీ నేత, అత్యధిక స్థానాలను కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ లో తన ఖాతాను తెరిచింది. గోషా మహల్ నుంచి రాజా సింగ్ ఘన విజయం సాధించారు. వరుసగా మూడోసారి ఘన విజయం సాధించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి పైడి రాకేశ్ రెడ్డి ఘన విజయం సాధించారు.
Assembly Election 2023 Results Live News Updates: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ లో తన ఖాతాను తెరిచింది. గోషా మహల్ నుంచి రాజా సింగ్ ఘన విజయం సాధించారు. వరుసగా మూడోసారి ఘన విజయం సాధించారు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి నందకిషోర్ వ్యాస్‌పై 21,312 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నిజామాబాద్ అర్బన్ నుంచి బీజేపీ అభ్యర్థి ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా గెలుపొందారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి పైడి రాకేశ్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఆర్మూర్ నుంచి బీఆర్ఎస్ నుంచి ఆశన్నగారి జీవన్ రెడ్డి, బీజేపీ నుంచి రాకేశ్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డిలు బరిలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి పైడి రాకేశ్ రెడ్డి సమీప కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ కుమార్‌పై గెలుపొందారు. బీజేపీ అభ్యర్థికి 40 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)