Telangana Assembly Elections 2023: వీడియో ఇదిగో, కొత్త ప్రభాకర్ రెడ్డి కోసం హాస్పిటల్‌కు పరిగెత్తుకుంటూ వెళ్ళిన మంత్రి హరీష్ రావు, దాడిని ఖండించిన తెలంగాణ మంత్రి
మెదక్ ఎంపీ, దుబ్బాక అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిపై మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. ఈ దాడి అత్యంత గర్హనీయమన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని వ్యాఖ్యానించారు. ఈ ఘటనను ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తున్నాయన్నారు.
మెదక్ ఎంపీ, దుబ్బాక అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిపై మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. ఈ దాడి అత్యంత గర్హనీయమన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని వ్యాఖ్యానించారు. ఈ ఘటనను ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తున్నాయన్నారు. మెరుగైన చికిత్స కోసం ప్రభాకర్ రెడ్డిని సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. నిందితుడు కత్తితో దాడి చేయడంతో కడుపులో గాయాలైనట్లు చెప్పారు.
కొత్త ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు, బీఆర్‌ఎస్ కేడర్ ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. ఎవరూ అధైర్యపడవద్దన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని హరీశ్ రావు అన్నారు. హత్యాయత్నం వెనుక రాజకీయ కుట్ర ఏదైనా ఉందా? అనే కోణంలో సమగ్ర దర్యాప్తు జరిపిస్తామన్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)