Telangana Assembly Election 2023: వీడియో ఇదిగో, బంజారాహిల్స్ నందినగర్‌లో ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి కేటీఆర్
తెలంగాణ మంత్రి కేటీఆర్ (Minister KTR) తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బంజారాహిల్స్ నందినగర్ (Nandi Nagar)లో గల ఓ పోలింగ్ బూత్‌లో భార్యతో కలిసి ఓటు వేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TS Assembly Elections ) పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగనుంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ (Minister KTR) తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బంజారాహిల్స్ నందినగర్ (Nandi Nagar)లో గల ఓ పోలింగ్ బూత్‌లో భార్యతో కలిసి ఓటు వేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేవాళ్లకే ఓటు వేశానని తెలిపారు. ‘తెలంగాణ పౌరుడిగా ఓటు హక్కు వినియోగించుకుని నా బాధ్యత నెరవేర్చా. అభివృద్ధి కోసం పాటు పడే పార్టీకి, ఒక మంచి నాయకుడికి ఓటు వేశా. తెలంగాణలో ఓటు ఉన్న పౌరులంతా ముందుకొచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ముఖ్యంగా పట్టణ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేయండి. ఓటు వేసి మీ హక్కును కాపాడుకోండి’ అంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)