Telangana Assembly Elections 2023: వీడియో ఇదిగో, ఇంకో పదేళ్లలో తెలంగాణకు నేనే ముఖ్యమంత్రిని, సంగారడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

విజయదశమి ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డిలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న జగ్గారెడ్డి.. విజయదశమి రోజున నా మనసులో మాట చెబుతున్నానన్నారు.

Sangareddy Congress MLA Jaggareddy

తాను ఇంకా పదేళ్లకైనా సీఎం అవుతానని, మీ కడుపులో పెట్టుకొని కాపాడుకోండి’’ అంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయదశమి ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డిలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న జగ్గారెడ్డి.. విజయదశమి రోజున నా మనసులో మాట చెబుతున్నానన్నారు. మీరు నన్ను మున్సిపల్ కౌన్సిలర్‌ని చేసిండ్రు. మీరు నన్ను మున్సిపల్ చైర్మన్ చేశారు. మీ ఆశీర్వాదం తోటి మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యాను. ఈ పదేళ్లకు నేను ముఖ్యమంత్రి అయ్యేవరకు కాపాడుకోండి. విజయదశమీ రోజు నా మనసులో మాట మీకు చెప్తున్నా ఆశీర్వదించండి’’ అని కోరారు.

Sangareddy Congress MLA Jaggareddy

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)