Telangana Elections Liquor Shops Bandh: 28 నుంచి 30 వరకు మద్యం దుకాణాల బంద్.. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఆదేశాలు
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ నెల 28 నుంచి 30 వరకు మద్యం అమ్మకాలను బంద్ చేయాలని వైన్స్, బార్ల యజమానులకు కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశించింది.
Hyderabad, Nov 6: అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) నేపథ్యంలో తెలంగాణలో (Telangana) మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు (Liquor Shops) మూతపడనున్నాయి. ఈ నెల 28 నుంచి 30 వరకు మద్యం అమ్మకాలను బంద్ చేయాలని వైన్స్, బార్ల యజమానులకు కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ యజమానులను అప్రమత్తం చేసింది. ఎన్నికలను సజావుగా నిర్వహించే క్రమంలో ఈసీ ఆదేశాలను పాటించాలని సూచించింది. లేనిపక్షంలో లైసెన్స్ లు రద్దు చేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)