Telangana Assembly Session 2024: వీడియో ఇదిగో, బీఆర్‌ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి, సర్పంచులకు పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేసిన మంత్రి సీతక్క
సర్పంచ్‌ల పదవి కాలం ఫిబ్రవరిలో ముగిసిందని, ఇప్పుడున్న పెండింగ్ బిల్లులు బీఆర్ఎస్ నుంచి వారసత్వంగా వచ్చినవేనని మంత్రి సీతక్క అన్నారు. హరీష్ రావు ఫైనాన్స్ మంత్రిగా ఆనాడు సంతకం పెడితే బిల్లులు క్లియర్ అయ్యేవికదా అని అన్నారు. కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులు ఇవ్వలేదని, తాము పెండింగ్ బిల్లులు చెల్లించం అనడం లేదని చెప్పారు.
సర్పంచుల బిల్లులు పెండింగ్‌పై జరిగిన చర్చలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన విమర్శలకు మంత్రి సీతక్క స్టాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు. సర్పంచుల బిల్లులు పెండింగ్ పెట్టిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని, ఆ పెండింగ్ బిల్లుల బరువు మేం మోస్తున్నామన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్ని అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ఆ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు రూ.1000 కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు.
సర్పంచ్‌ల పదవి కాలం ఫిబ్రవరిలో ముగిసిందని, ఇప్పుడున్న పెండింగ్ బిల్లులు బీఆర్ఎస్ నుంచి వారసత్వంగా వచ్చినవేనని మంత్రి సీతక్క అన్నారు. హరీష్ రావు ఫైనాన్స్ మంత్రిగా ఆనాడు సంతకం పెడితే బిల్లులు క్లియర్ అయ్యేవికదా అని అన్నారు. కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులు ఇవ్వలేదని, తాము పెండింగ్ బిల్లులు చెల్లించం అనడం లేదని చెప్పారు. కచ్చితంగా బీఆర్ఎస్ వారసత్వంగా ఇచ్చిన బకాయిలు, పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని సీతక్క స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి అని మంత్రి సీతక్క అన్నారు.
We will clear the bills says Minister seethakka