Pocharam Srinivas Reddy: పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌, ఏఐజీ ఆసుపత్రిలో చేరిన తెలంగాణ శాసనసభ స్పీకర్‌, తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచన

తెలంగాణ శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలింది. రెగ్యులర్ మెడికల్ టెస్ట్‌లలో భాగంగా బుధవారం రాత్రి చేయించిన కోవిడ్‌ పరీక్షల్లో స్పీకర్‌కు పాజిటివ్ నమోదు అయింది. దీంతో ఆయన గురువారం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. కాగా ఇటీవల పోచారం తన మనవరాలి పెళ్లిలో పలువురు రాజకీయ ప్రముఖులను కలిశారు.

Pocharam Srinivas Reddy (photo-Video Grab)

తెలంగాణ శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలింది. రెగ్యులర్ మెడికల్ టెస్ట్‌లలో భాగంగా బుధవారం రాత్రి చేయించిన కోవిడ్‌ పరీక్షల్లో స్పీకర్‌కు పాజిటివ్ నమోదు అయింది. దీంతో ఆయన గురువారం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. కాగా ఇటీవల పోచారం తన మనవరాలి పెళ్లిలో పలువురు రాజకీయ ప్రముఖులను కలిశారు.

అయితే గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, తగు జాగ్రత్తలతో హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండాలని కోరారు. కాగా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలి పెళ్లి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్‌తోపాటు ప్రముఖ రాజకీయ నాయకులందరూ హాజరయ్యారు.

Share Now
Advertisement

సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement