Bandi Sanjay: వృద్ధురాలి పాదాల‌కు చెప్పులు తొడిగిన బండి సంజయ్, సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ చేసిన బీజేపీ తెలంగాణ, పెద్ద‌ల‌ను గౌర‌వించండి అంటూ కామెంట్

ప్ర‌జా సంగ్రామ యాత్ర పేరిట బండి సంజ‌య్ తెలంగాణ‌లో యాత్ర సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ యాత్ర‌లో భాగంగా ఆయ‌న ఇటీవ‌లే ఓ వృద్ధురాలి పాదాల‌కు చెప్పులు తొడిగారు. ఈ ఫొటోల‌ను బుధ‌వారం సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ చేసిన బీజేపీ తెలంగాణ శాఖ వైరి వ‌ర్గాల‌కు కౌంటర్ ఇచ్చింది.

Telangana BJP chief Bandi Sanjay Kumar arranges slippers to a Elder Woman

తెలంగాణ ప‌ర్య‌ట‌నలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు చెప్పులు అందించిన బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌పై వైరి వ‌ర్గాలు పెద్ద ఎత్తున ట్రోలింగ్‌కు దిగిన సంగ‌తి తెలిసిందే. ఈ ఆరోప‌ణ‌ల‌ను ఖండించిన బండి సంజ‌య్‌.. పెద్ద‌ల చెప్పులు మోయ‌డంలో త‌ప్పేముందంటూ ఎదురు దాడికి కూడా దిగారు.ఇదిలావుంచితే, ప్ర‌స్తుతం ప్ర‌జా సంగ్రామ యాత్ర పేరిట బండి సంజ‌య్ తెలంగాణ‌లో యాత్ర సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ యాత్ర‌లో భాగంగా ఆయ‌న ఇటీవ‌లే ఓ వృద్ధురాలి పాదాల‌కు చెప్పులు తొడిగారు. ఈ ఫొటోల‌ను బుధ‌వారం సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ చేసిన బీజేపీ తెలంగాణ శాఖ వైరి వ‌ర్గాల‌కు కౌంటర్ ఇచ్చింది. 'పెద్ద‌ల‌ను గౌర‌వించండి. వారి దీవెన‌లు ఎల్ల‌ప్పుడూ మిమ్మ‌ల్ని వ్య‌తిరేక‌త నుంచి కాపాడ‌తాయి' అంటూ ఓ కామెంట్‌ను జ‌త చేసింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now