MP Dharmapuri Arvind: కేసీఆర్‌ మానసిక పరిస్థితి దిగజారుతోంది, ఇకపై పరుష పదజాలంతో ఆయనను విమర్శించను, రాజకీయంగా, సాంకేతికంగానే సీఎంను విమర్శిస్తానని తెలిపిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్

రాజకీయంగా, సాంకేతికంగానే కేసీఆర్‌ను విమర్శిస్తానని, ఇవి ఆవేదనతో చెబుతున్న మాటలని వ్యాఖ్యానించారు.

Dharmapuri Arvind (Photo-Video Grab)

గత కొంతకాలంగా తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై విరుచుకుపడుతున్న నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఇకపై సీఎంను పరుష పదజాలంతో విమర్శించబోనని స్పష్టంచేశారు. రాజకీయంగా, సాంకేతికంగానే కేసీఆర్‌ను విమర్శిస్తానని, ఇవి ఆవేదనతో చెబుతున్న మాటలని వ్యాఖ్యానించారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. రాష్ట్రంలో తాజా పరిణామాలతో బీజేపీ ఎదుగుదలను, దిగజారుతున్న టీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ కారణంగానో లేక కుటుంబ వారసత్వ రాజకీయాల ఒత్తిడి కారణంగానో కేసీఆర్‌ మానసిక పరిస్థితి రోజురోజుకి దిగజారుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. కేసీఆర్‌ ఇంట్లో వారసత్వ పోరు మొదలైందని తెలిపారు. శనివారం వరద ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా తెలంగాణపై విదేశాలు కుట్ర పన్ని క్లౌడ్‌ బరస్ట్‌ చేయడంతో వరదలు సంభవించాయని కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ఎంతో బాధాకరమని అన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)