Telangana: పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై వెంటనే చర్యలు తీసుకోండి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌తో మాజీ మంత్రి కేటీఆర్ భేటీ, రాహుల్ గాంధీపై ధ్వజం
ఫిర్యాదు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు.
పార్టీ మారిన ఎమ్మెల్యే లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో కేటీఆర్‌తో పాటు ఇతర బీఆర్‌ఎస్ నేతలు భేటీ అయ్యారు. ఫిర్యాదు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు.మార్చి 18న దానం నాగేందర్ పై ఫిర్యాదు చేశాం.ఇతర ఎంఎల్ఏల విషయంలో కూడా అనర్హత వేటు వేయాలని కోరాము.పలువురు నేతలు బీఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో చేరి నాలుగు నెలలు అవుతుంది. వారిపై చర్యలు తీసుకోకపోతే అది స్పీకర్ పదవికే అవమానని తెలిపారు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారులకంటే దారుణం..రేవంత్‌పై హరీష్ ఫైర్
మూడు నెలల్లో పార్టీ మారిన ఎంఎల్ఏలపై చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా మణిపూర్‌లో పార్టీ మారిన ఎంఎల్ఏపై చర్యలు తీసుకున్నారు.ఇక్కడ కూడా పార్టీ మారిన బీఆర్ఎస్ ఎంఎల్ఏలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరినట్లు కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీ రాజ్యాంగం పట్టుకొని ఫోజులు కొడుతారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కానీ తెలంగాణలో అదే కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పుడుతుందని ధ్వజమెత్తారు.
Here's BRS Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)