Harishrao on Runamafi(Pic from Harishrao Facebook)

Hyd, July 16: సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి ఛాలెంజ్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్‌ రావు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన హరీష్‌..రుణమాఫీపై కాంగ్రెస్ తెచ్చిన గైడ్ లైన్స్‌ గందరగోళంగా ఉన్నాయని చెప్పారు. రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం...ఆపై రుణం తీసుకున్న రైతుల గురించి ఆలోచించలేదన్నారు.

రెండు లక్షలకు పైగా రుణం తీసుకున్న రైతులు తొలుత లక్ష రూపాయలు చెల్లిస్తేనే మిగితా రెండు లక్షల రుణమాఫీ జరుగుతుందని చెప్పడం సమంజసం కాదన్నారు. దీనివల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తే తాను రాజీనామా చేస్తానన్న మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.

ఆగస్ట్ 15వ తేదీ నాటికి ఆరు గ్యారంటీలు, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని చెప్పానని...సీఎం రేవంత్ ఆ మాటను నిలబెట్టుకోవాలని సవాల్ విసిరారు. రుణమాఫీ మార్గదర్శకాలతో రైతుల సంఖ్య తగ్గించేందుకు ప్రభుత్వం అనేక నిబంధనలు పెట్టిందని మండిపడ్డారు.ఫ్రాంక్ వీడియో తెచ్చిన తంటా ఓ యూ ట్యూబర్‌ను కటకటలా పాలు చేసింది. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఫ్రాంక్ చేసి అందరి విమర్శలకు గురయ్యాడు ఓ తమిళ యూ ట్యూబర్. 

రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే రుణమాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో ఎందుకు చెప్పలేదని ...ప్రైవేట్ వడ్డీ వ్యాపారులకంటే దారుణమైన నిబంధనలు తెచ్చారని విమర్శించారు. ప్రజా పాలనలో రేషన్ కార్డులకు 7 నెలల కింద దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. రేవంత్ చెప్పే మాటలకు, చేతలకు పొంతన లేదని ...రుణమాఫీపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.