Telangana: సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా కానుక, 2023 కంపెనీ లాభాల్లో కార్మికులకు 32శాతం వాటా చెల్లించేలా కీలక ఆదేశాలు

సింగరేణి కార్మికులు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంస్థ సాధించిన లాభాల్లో 32శాతం వాటా చెల్లించేందుకు నిర్ణయించిన సీఎం కేసీఆర్‌.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి రూ.2,222 కోట్ల రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది.

CM KCR (Photo-Video Grab)

సింగరేణి కార్మికులు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంస్థ సాధించిన లాభాల్లో 32శాతం వాటా చెల్లించేందుకు నిర్ణయించిన సీఎం కేసీఆర్‌.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి రూ.2,222 కోట్ల రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. ఇందులో రూ.700కోట్లకుపైగా లాభాలను కార్మికులకు దసరా ముందస్తుగా చెల్లించనున్నట్లు సీఎం కేసీఆర్‌ రెండు నెలల కిందట మంచిర్యాలలో ప్రకటించారు. ఇచ్చిన మాటమేరకు గతంలో గతంలో 30శాతానికి మించి కార్మికులకు రూ.700కోట్లకుపైగా లాభాల్లో వాటా వచ్చేలా 32శాతం వాటా రూ.711 కోట్లను ప్రకటించారు. ఇటీవలనే కార్మికులకు 11వ వేతన ఒప్పందానికి సంబంధించి 23 నెలల బకాయిలు దాదాపు రూ.1,450 కోట్లను ప్రభుత్వం చెల్లించింది.

CM KCR Govt Decide Share 32 percent profit to Singareni workers (Photo-TS CMO)

 

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement