Telangana:తెలంగాణ ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం, మెట్రో రైల్ రెండో దశకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన, నాగోల్-రాయదుర్గం కారిడార్ కు కొనసాగింపుగా నిర్మాణం

మెట్రో రైల్ రెండో దశకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. నాగోల్-రాయదుర్గం కారిడార్ కు కొనసాగింపుగా దీన్ని నిర్మించనున్నారు. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు నిర్మించనున్న ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ మెట్రోకు మైండ్ స్పేస్ వద్ద కేసీఆర్ భూమిపూజ చేశారు.

CM KCR

తెలంగాణ ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. మెట్రో రైల్ రెండో దశకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. నాగోల్-రాయదుర్గం కారిడార్ కు కొనసాగింపుగా దీన్ని నిర్మించనున్నారు. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు నిర్మించనున్న ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ మెట్రోకు మైండ్ స్పేస్ వద్ద కేసీఆర్ భూమిపూజ చేశారు. ప్రత్యేక పూజలను నిర్వహించి పునాదిరాయి వేశారు.

31 కిలోమీటర్ల మేర ఈ మెట్రో లైన్ ను నిర్మించనున్నారు. రూ. 6,250 కోట్ల అంచనాలతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. మూడేళ్లలోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మెట్రో లైన్ నిర్మాణానికి మొత్తం నిధులను రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఎయిర్ పోర్టుకు 20 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉంటుంది.ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Here's TRS Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Manmohan Singh Funeral Ceremony: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు బీఆర్ఎస్ నేతలు, తెలంగాణతో మన్మోహన్‌కు ప్రత్యేక అనుబంధం ఉందన్న కేసీఆర్, ప్రతి సందర్భంలో మనోధైర్యం నింపారని వెల్లడి

KCR Condolence To Manmohan Singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి.. మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని వ్యాఖ్య

Manmohan Singh-Telangana: మన్మోహనుడి హయాంలోనే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు.. ఎంతమంది వ్యతిరేకించినప్పటికీ వెనక్కితగ్గని ధీశాలి

New Flight Luggage Rules: విమాన ప్రయాణీకులకు అలర్ట్..ఇకపై ఒక క్యాబిన్ బ్యాగుకు మాత్రమే అనుమతి...నిబంధనలు పాటించకుంటే జరిమానా తప్పదు...పూర్తి వివరాలివే