Telangana: ఔటర్ రింగ్ రోడ్ టోల్ కాంట్రాక్ట్ అవకతవకలపై విచారణ జరిపించేందుకు సిట్ ఏర్పాటు, హరీష్‌రావు విజ్ఞప్తి మేరకు సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
ఔటర్ రింగ్ రోడ్ టోల్ కాంట్రాక్ట్ (ORR Toll contract)లో జరిగిన అవకతవకలపై సిఎం రేవంత్ రెడ్డి SIT విచారణకు ఆదేశించారు. ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చేసిన విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు.
SIT Probe Into ORR Toll Contract: ఔటర్ రింగ్ రోడ్ టోల్ కాంట్రాక్ట్ (ORR Toll contract)లో జరిగిన అవకతవకలపై సిఎం రేవంత్ రెడ్డి SIT విచారణకు ఆదేశించారు. ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చేసిన విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు.
ప్రతిపక్షాల అభ్యర్థన మేరకు, ఔటర్ రింగ్ రోడ్ (ORR) టోల్ కాంట్రాక్ట్‌పై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తుంది. హరీష్‌రావు విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని సభలోని సభ్యులందరి ఆమోదంతో సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నాం. కేబినెట్ సమావేశంలోనూ చర్చించి విధివిధానాలు రూపొందిస్తామన్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ORR), నగరాన్ని చుట్టుముట్టే 158 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌వే ఇప్పుడు ముఖ్యమైన వివాదానికి కేంద్రంగా మారింది. తాజాగా అసెంబ్లీలో ఎన్నికల ముంగిట ఓఆర్‌ఆర్‌ను 30 ఏళ్లపాటు లీజుకు ఇవ్వటంపై రాష్ట్రంలో తీవ్ర చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఔటర్ రింగ్‌రోడ్డు లీజు టెండర్లపై విచారణ జరిపించేందుకు సిట్ ఏర్పాటు చేస్తాం’’ అని సీఎం తెలిపారు.
SIT Probe Into ORR Toll Contract
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)