CM Revanth Reddy Responds CM Jagan Tweet: ఏపీ సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అభివృద్ధిలో పరస్పర సహకారాన్ని ఆకాంక్షిస్తున్నామంటూ ట్వీట్ కు రిప్లై
ఈ క్రమంలో సీఎం రేవంత్‌కు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కూడా సీఎం రేవంత్‌కు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం రేవంత్‌కు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కూడా సీఎం రేవంత్‌కు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన రేవంత్..‘శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. సాటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో పాటు, పొరుగు రాష్ట్రాలతో స్నేహభావం.. అభివృద్ధిలో పరస్పర సహకారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది’ అంటూ కామెంట్స్ చేశారు.
అంతకుముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్‌కు శుభాకాంక్షలు చెబతూ..‘తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు. ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులకు శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని వ్యాఖ్యలు చేశారు.
Here's Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)