Pride Place: ప్రైడ్ ప్లేస్ ట్రాన్స్ జెండర్ ప్రొటెక్షన్ సెల్ ను ప్రారంభించిన డీజీపీ మహేందర్ రెడ్డి, ట్రాన్స్ జెండర్లకు చట్టపరంగా భద్రత, రక్షణ కల్పించేలా చేస్తామని వెల్లడి

రాష్ట్ర మహిళా సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ప్రైడ్ ప్లేస్ అనే ట్రాన్స్ జెండర్ ప్రొటెక్షన్ సెల్ ను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి ట్రాన్స్ జెండర్ల భద్రత కోసం ప్రైడ్ ప్లేస్ స్టార్ట్ చేశామన్నారు.

Telangana DGP Mahender Reddy (File photo)

ట్రాన్స్ జెండర్లకు చట్టపరంగా భద్రత, రక్షణ కల్పించేలా చేస్తామన్నారు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి. రాష్ట్ర మహిళా సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ప్రైడ్ ప్లేస్ అనే ట్రాన్స్ జెండర్ ప్రొటెక్షన్ సెల్ ను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి ట్రాన్స్ జెండర్ల భద్రత కోసం ప్రైడ్ ప్లేస్ స్టార్ట్ చేశామన్నారు. ట్రాన్స్ జెండర్లపై వివక్ష, హింసనును అరికట్టడమే ఈ ప్రైడ్ ప్లేస్ లక్ష్యమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్ జెండర్ల కోసం ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రొటెక్షన్ సెల్ ట్రాన్స్ జెండర్స్ వ్యక్తులకు బాగా ఉపయోగపడుతుందని, ట్రాన్స్ జెండర్లకు హక్కులపై అవగాహన కల్పించడం, చట్టపరంగా వారికి ఉన్న భద్రత, రక్షణ ఉండేలా చేస్తామన్నారు. రాష్ట్రంలో మహిళలకు పోలీసు శాఖ ఎంతో ప్రాధాన్యత,భద్రతా ఇస్తుందని డిజిపి మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు