Telangana Elections 2023: వీడియో ఇదిగో, అక్బ‌రుద్దీన్ ఓవైసీపై కేసు నమోదు, డ్యూటీలో ఉన్న పోలీసు అధికారిని దూషించారనే అభియోగాలపై కేసు బుక్

ఈ మేరకు ఓ వీడియో వైరల్‌ కావడం కూడా తెలిసిందే.

Akbaruddin Owaisi (photo-X)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పోలీస్ అధికారిని దూషించారనే ఆరోపణల్లో భాగంగా ఎంఐఎం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ(Akbaruddin Owaisi)పై సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఈ మేరకు ఓ వీడియో వైరల్‌ కావడం కూడా తెలిసిందే. ల‌లితాబాగ్‌లో మంగళవారం రాత్రి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న స‌మయంలో.. సమయం అయిపోతుందని, ప్ర‌చారం ముగించాల‌ని స్థానికంగా విధులు నిర్వ‌స్తున్న ఎస్సై శివచంద్ర అక్బరుద్దీన్‌ను కోరారు. ఆ స‌మ‌యంలో పోలీసు అధికారిపై అక్బ‌రుద్దీన్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఇంకా సమయం ఉందని, తాను మాట్లాడి తీరతానని, తనను ఆపేవాళ్లింకా పుట్టలేదని, తనను ఆపే దమ్ము ఎవరికీ లేదని, తన ఒంట్లో బుల్లెట్లు దిగినా.. కత్తిగాయాలు అయినా ధైర్యం ఇంకా మిగిలే ఉందని, ఒక్క సైగ చేస్తే ఇక్కడ ఉన్న అందరూ నిన్ను పరిగెత్తిస్తారంటూ ఎస్సైను ఉద్దేశించి అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో పాటు రాజకీయంగానూ విమర్శలకు తావిచ్చింది. మరోవైపు ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్‌ 353(విధుల్ని అడ్డుకోవ‌డం)తో పాటు మరికొన్ని సెక్ష‌న్ల కింద అక్బరుద్దీన్‌ ఒవైసీపై కేసు న‌మోదు చేసిన‌ట్లు డీసీపీ రోహిత్ రాజు వెల్లడించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Union Budget 2025-26: వేత‌న‌జీవుల‌కు త్వ‌ర‌లోనే గుడ్ న్యూస్, రూ. 15 ల‌క్ష‌ల వ‌ర‌కు ట్యాక్స్ మిన‌హాయింపు ఇచ్చే యోచ‌న‌లో కేంద్రం, ఈ బడ్జెట్ లో బొనాంజా ప్ర‌కటించే ఛాన్స్

Weather Forecast: నెల్లూరు జిల్లాకు అలర్ట్, బలహీనపడి అల్పపీడనంగా మారిన తీవ్ర అల్పపీడనం, ఏపీలో అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Tollywood Film Industry Meet CM Revanth Reddy: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన

CM Revanth Reddy: తెలంగాణలో ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు..సినీ పెద్దలతో తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరోగా ఉండాలని సూచించిన తెలంగాణ సీఎం