Telangana Electricity Bills: యూపీఐ యాప్ లతో విద్యుత్ బిల్లుల చెల్లింపులు వద్దు.. అధికారిక వెబ్ సైట్, యాప్ లలో మాత్రమే చెల్లించాలంటూ టీజీఎస్‌పీడీఎల్ కీలక ప్రకటన
తెలంగాణలో విద్యుత్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి విద్యుత్ వినియోగ సంస్థలు టీజీఎస్‌పీడీసీఎల్, టీజీఎన్‌పీడీసీఎల్ కీలక ప్రకటన చేశాయి.
Hyderabad, July 2: తెలంగాణలో విద్యుత్ బిల్లుల చెల్లింపులకు (TS Power bill Payment) సంబంధించి విద్యుత్ వినియోగ సంస్థలు టీజీఎస్‌పీడీసీఎల్ (TGSPDCL), టీజీఎన్‌పీడీసీఎల్ (TGNPDCL) కీలక ప్రకటన చేశాయి. నెలవారీ విద్యుత్ బిల్లులను తమ అధికారిక వెబ్ సైట్, యాప్ లపై మాత్రమే చెల్లించాలని సూచించాయి. ఫోన్‌పే, పేటీఎం, అమెజాన్‌పే, గూగుల్ వంటి యూపీఐ యాప్ లతో విద్యుత్ బిల్లుల చెల్లింపులు వద్దని పేర్కొన్నాయి. ఈ మేరకు అన్ని చెల్లింపు గేట్ వేలు, బ్యాంకుల ద్వారా చెల్లింపులను జులై 1 నుంచి నుంచి ఆర్బీఐ నిలిపివేసినట్టు గుర్తుచేసింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)