Excise CI Assaults Tribal Woman: గిరిజన మహిళపై విచక్షణారహితంగా దాడి చేసిన ఎక్సైజ్ సీఐ, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు, చర్యలు తీసుకోవాలని లంబాడి హక్కుల పోరాట సమితి డిమాండ్

ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించింది.

Excise Officer Assaults Tribal Woman (photo-Video Grab/Telugu Scribe)

వరంగల్ లో (Warangal) ఓ గిరిజన మహిళను ఎక్సైజ్ సీఐ రమేష్ చంద్ర (Excise CI Ramesh Chandra) విచక్షణారహితంగా చితకబాదినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించింది. ఆమె పోలీసులకు తెలిపిన ఫిర్యాదు ప్రకారం.. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం చంద్ర జాన్ పాకకు చెందిన తేవావత్ బుజ్జి అనే గిరిజన వివాహిత వ్యక్తిగత పని నిమిత్తం బుధవారం ఇంటి నుంచి బయటకు వచ్చింది.

తిరిగి ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో ఓ టాటా సుమో వెహికల్ ఆమె దగ్గరకు వచ్చి ఆగింది. అందులో ఎక్సైజ్ సీఐ రమేష్ చంద్రతో పాటు ఇతర పోలీసులు ఉన్నారు. అయితే...ఇదే సమయంలో...తేవావత్ బుజ్జి అనే గిరిజన వివాహితను ప్రశ్నలతో టార్చెర్‌ పెట్టారని ఫిర్యాదులో పేర్కొంది. ఇక ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది బాధితురాలు. గిరిజన మహిళపై ఎక్సైజ్ సీఐ దాడికి నిరసనగా లంబాడి హక్కుల పోరాట సమితి ధర్నా నిర్వహించారు. వరంగల్‌లో తేజావత్ బుజ్జి అనే గిరిజన మహిళపై దాడి చేసి విచక్షణారహితంగా కొట్టిన ఎక్సైజ్ సీఐ రమేష్ చంద్రపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. చింతల్ బ్రిడ్జి ఫ్లై ఓవర్ దగ్గర లంబాడి హక్కుల పోరాట సమితి నిరసన చేపట్టారు.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)