Fire Accident in Gadwal: గద్వాల జిల్లాలో భారీ అగ్నిప్రమాదం, వడ్డేపల్లి శాంతినగర్ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో మంటలు, 12 గ్రామాలకు నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
తెలంగాణలో జోగుళాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ అగ్నిప్రమాదం సంభవించింది. వడ్డేపల్లిలోని శాంతినగర్ సబ్‌స్టేషన్‌లో బుధవారం మధ్యాహ్నం షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి.
తెలంగాణలో జోగుళాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ అగ్నిప్రమాదం సంభవించింది. వడ్డేపల్లిలోని శాంతినగర్ సబ్‌స్టేషన్‌లో బుధవారం మధ్యాహ్నం షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంద్ది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అగ్నిప్రమాదం కారణంగా సబ్‌స్టేషన్ పరిధిలోని 12 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కాగా, అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదం వల్ల భారీగా నష్టం వాటిల్లిందని విద్యుత్ అధికారులు వెల్లడించారు. కరెంటు సరఫరాను పునరుద్ధరించడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)