Fire Accident in Pharma Company: సంగారెడ్డి జిల్లా ఫార్మా కంపెనీలో ఘోర అగ్ని ప్రమాదం, లీ ఫార్మాలో ఒక్కసారిగా ఎగసిన మంటలు, పలువురు కార్మికులకు గాయాలు

సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లీ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. కార్మికులు, స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Fire| Representational Image (Photo Credits: Pixabay)

సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లీ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. కార్మికులు, స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వివరాల ప్రకారం.. గడ్డిపోతారం ఇండస్ట్రీయల్‌ ప్రాంతంలో ఉన్న లీ ఫార్మా కంపెనీలో బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది. కంపెనీలో రియాక్టర్ల వద్ద మంటలు చెలరేగాయి. దీంతో, పరిశ్రమలో ఉన్న కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులకు గాయాలు కావడంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మంటలు ఎగిసిపడటంతో అదుపు చేసేందుకు స్థానికులు, కార్మికులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now