Hyderabad Fire Video: షాద్ నగర్ అగ్నిప్రమాదం, మంటల్లో చిక్కుకున్న 50 మంది కార్మికుల ప్రాణాలను కాపాడిన బాలుడు, వీడియో ఇదిగో..
నందిగామ మండల కేంద్రంలోని అల్విన్ ఫార్మసీ కంపెనీలో ప్రమదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అగ్నికీలలు ఎగిసిపడటంతో.. కంపెనీ మొత్తానికి మంటలు వ్యాపించాయి.
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నందిగామ మండల కేంద్రంలోని అల్విన్ ఫార్మసీ కంపెనీలో ప్రమదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అగ్నికీలలు ఎగిసిపడటంతో.. కంపెనీ మొత్తానికి మంటలు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 50 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. కొందరు కార్మికులను కిటికీల్లోంచి నిచ్చెనల సాయంతో బయటకు తీసుకొచ్చారు. అగ్ని ప్రమాద సమయంలో సాయచరణ్ అనే బాలుడు ధైర్య సాహసాలు ప్రదర్శించాడు. అగ్నిప్రమాద తీవ్రతను పసిగట్టిన బాలుడు.. భవనం పైకి ఎక్కి తాడు కట్టాడు. కిటీకి ద్వారా కార్మికులు కిందకు దిగేందుకు సాయం చేశాడు. మొత్తం 50 మందిని కార్మికులను కాపాడాడు. వీడియోలు ఇవిగో, భారీ అగ్నిప్రమాదంలో భయంతో బిల్డింగ్ పై నుండి దూకుతున్న సిబ్బంది, మంటల్లో చిక్కుకున్న 50 మంది
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)